- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ నేరగాళ్ల వలలో మోసపోయిన ఇంజనీరింగ్ విద్యార్థి.. 20 వేలు స్వాహా
ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేద్దామనుకున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థినీ సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయింది.

దిశ, భూదాన్ పోచంపల్లి: ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేద్దామనుకున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థినీ సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయింది. పోలీసులు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దు అంటూ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న ఎక్కడో ఒకచోట వారి మాయలో పడుతున్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో గల సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని సైబర్ నేరగాళ్ల వలలో పడి 20,000 మోసపోయింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల పార్ట్ టైం జాబ్ చేసేందుకు ఆన్లైన్లో కనిపించిన అప్లికేషన్ ను పూర్తి చేసి పంపింది. అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి మీరు ఆన్లైన్లో జాబ్ కి అప్లై చేశారు కదా ఎందుకు చేయడం లేదంటూ ఫోన్ చేసి ప్రశ్నించాడు. నేను చదువుకుంటున్నాను.. నాకు వీలు కావడం లేదు అంటూ విద్యార్థిని బదులు ఇవ్వగా జాబ్ చేయడం ఇష్టం లేకపోతే పెనాల్టీ చెల్లించాలని బెదిరించాడు.
దీంతో ఆ విద్యార్థిని భయపడి మొదటగా ఐదు వేల రూపాయలు తనకి ఫోన్ పే పంపింది .అంతటితో ఆగకుండా నీపై కేసు పెడతానంటూ బెదిరించడంతో ఆ విద్యార్థిని భయపడి 15 వేల రూపాయలు మరల పంపింది. వెంటనే తన స్నేహితులకు జరిగిన విషయాన్ని చెప్పి బోరున ఏడ్చింది. స్నేహితుల సూచన మేరకు 1930కు కాల్ చేసి సమాచారం అందించింది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన్నట్లు బాధితురాలు తెలిపింది.






