వ‌రికోత స‌మ‌యంలో విద్యుత్ ప్ర‌మాదం

by Bhanu |

వ‌రికోత స‌మ‌యంలో విద్యుత్ ప్ర‌మాదం
X

దిశ, కనగల్ : కనగల్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వరి కోత మిషన్‌కు పై నుంచి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగలడంతో ఒకరు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డ్ సమీపంలో వరి కోత మిషన్‌తో వరి కోత కొనసాగుతున్న సమయంలో, కిందకు వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ వైర్లు పనికి ఇబ్బందిగా మారాయి. వాటిని కర్రతో పైకి ఎత్తిపట్టి కోత కొనసాగించే ప్రయత్నంలో కర్ర జారి పోవడంతో, విద్యుత్ వైర్లు మిషన్‌కు అమర్చిన ఇనుప సువ్వలకు తగిలాయి. దీంతో తీవ్రమైన షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వరి కోత మిషన్ డ్రైవర్ తీవ్ర విద్యుదాఘాతానికి గురై ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, విద్యుత్ శాఖకు సమాచారం అందించారు.

Next Story