చట్టబద్ధత గల రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి : రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, నేరేడుగొమ్ము : నేరేడు గోమ్ము మండల ప‌రిధిలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందించారు.

చట్టబద్ధత గల రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి :  రాష్ట్ర కార్యదర్శి  శ్రీనివాస్ గౌడ్
X

దిశ, నేరేడుగొమ్ము : నేరేడు గోమ్ము మండల ప‌రిధిలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పుడు పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్ కల్పిస్తామని అనడం సమంజసం కాదన్నారు. తప్పకుండా రాజకీయ రంగాల్లో చట్టబద్ధత రిజర్వేషన్లు అమలు చేశాకే, స్థానిక ఎన్నికలు జరపాలని.. లేని యెడల బీసీలను మరోసారి మోసం చేసినట్లే అవుతుందన్నారు. అఖిలపక్ష పార్టీలతో ఢిల్లీలో కేంద్రాన్ని కలిసి 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద అన్న పాత్ర లాగా బాధ్యత వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మెరుగు పెద్దయ్య, కుంభం బాలచందర్ గౌడ్, రెడ్డి యాదయ్య, రెడ్డి కోటేశ్వరరావు, కోనేటి రాములు, పల్సా శ్రీనివాస్ గౌడ్, కాసాని ఇదయ్య గౌడ్, లింగం, పులికంటి మైసయ్య, కొత్తపల్లి పర్వతాలు, కొత్తపల్లి చిన్నయ్య, పిట్టల ముత్యాలు, గుద్దేటి నరసింహ, చింతకుంట్ల లింగయ్య, నంద్యాల రవి పాల్గొన్నారు.

Next Story