- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క పదవికి రూ. 6 కోట్లపైనే... పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థికి రూ.10 లక్షలు
సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ఖర్చు అమాంతంగా పెరిగిపోయింది. మున్సిపాలిటీలో ని ఓ పదవి కోసం ఏకంగా ఓ ప్రముఖ రాజకీయ పార్టీ అభ్యర్థి ఆరు కోట్ల పైగా ఖర్చు చేశాడంటే అతిశయోక్తి లేదు.

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ఖర్చు అమాంతంగా పెరిగిపోయింది. మున్సిపాలిటీలో ని ఓ పదవి కోసం ఏకంగా ఓ ప్రముఖ రాజకీయ పార్టీ అభ్యర్థి ఆరు కోట్ల పైగా ఖర్చు చేశాడంటే అతిశయోక్తి లేదు. పదవి తనని వరించాలని ఉద్దేశంతో మున్సిపాలిటీలోని 48 వార్డు లకు గాను 42 వార్డుల అభ్యర్థులకు ఒక్కో అభ్యర్థికి పది లక్షల పైగా ఇచ్చినట్లు జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మందు విందులు జోరందుకున్నాయి. నిత్యం మద్యం బాటిళ్లు, చికెన్ విందులు సాగాయి. జిల్లాలో ఉన్న వైన్స్ ల ల్లో నిత్యం మద్యం అమ్మకాలు సాగుతుండగా మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని రోజుకంటే ఐదు రెట్లు పైగా మద్యం అమ్మకాలు సాగాయి.
ఈ రోజుల్లో డబ్బుంటే ఏదైనా సాధ్యమే,డబ్బులు ఉంటే తిమ్మిని బమ్మి చేయవచ్చు అన్న చందం గా మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నోళ్లు, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టినోళ్లు, జిల్లాలో కౌన్సిలర్లు గా గెలవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డబ్బుకు ఓటరు దాసోహం అయ్యాడు ఎన్నికల సమయంలోనే ఎవరు ఎంతిస్తున్నారని ఆరా తీయడమే ఇందుకు నిదర్శనం. దీంతో అభ్యర్థులు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా విపరీతంగా డబ్బులు ఖర్చు చేశారు.
గ్రామాలను మించిన పట్టణాలు..
ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు రోజువారీగా ముమ్మర ప్రచారం చేశారు. సుమారు ఆరు రోజుల పాటు ప్రచారం సాగింది. నామినేషన్ల కంటే ముందు నుంచి కూడా పోటీ చేసిన అభ్యర్థులు వార్డుల్లో తిరుగుతూ కొంత మొత్తంలో ఖర్చు చేశారు. ప్రతీ రోజు వార్డుల్లో రెండు ఆటోలను ఏర్పాటు చేసి మైక్ ల తో ప్రచారం చేయించారు. అంతేకాకుండా ప్రతీ రోజు 30 నుంచి 50 మందితో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన వారికి రూ.100 నుంచి రూ.300వరకు ఇచ్చారు. ఆ వార్డులో ఉండే స్థానిక నాయకులకు కూడా కొంత మొత్తంలో ముట్టజెప్పాల్సి వచ్చింది.
ఇవేగాక పార్టీల జెండాలు, ప్లెక్సీలు, కరపత్రాలు, నమునా బ్యాలెట్ పత్రాలు, టోపీలు, డోర్ పోస్టర్లు ఇతర వాటికి కూడా లక్షల్లో అభ్యర్థులు ఖర్చు చేశారు.ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంలో సూర్యా పేట కోదాడ పట్టణాలు పల్లెలను మించిపోయాయి. పల్లెల్లో ఓటుకు రూ.500, రూ.౧౦౦౦ ఇస్తే.. పట్టణాల్లో కనీస ఓటు ధర రూ.1000 పలికింది. కొన్ని మేజర్ గ్రామాల్లో ఓటుకు రూ.1500 నుంచి రూ.5వేలు వరకు ఇవ్వగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ధర రూ.10 వేలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. డబ్బులు తీసుకోని కొందరికి వస్తువులు, ఖరీదైన చీరలు, ఇతర గిఫ్ట్లు అందించారు. మొత్తంగా జిల్లాలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ఎన్నికలు జరిగాయి. సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే పరిస్థితులు అసలేవు.
ఓటుకు రూ.10 వేలు....
సూర్యాపేట కు చెందిన ఓ కాంట్రాక్టర్ తొలిసారి మున్సిపల్ ఎన్నికల బరిలో దిగారు. అతనిపై ఎంతో రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తులు పోటీ చేశారు. మరో అభ్యర్థి కూడా ఆర్థికంగా ఉన్నవారే కావడంతో ముగ్గురూ విజయం కోసం పోటీ పడ్డారు. ఓటుకు రూ.5వేల చొప్పున ఒక్కరు, రూ.7వేల చొప్పున మరొకరు పంపిణీ చేయగా,రాజకీయ అనుభవం లేని ఆ వ్యక్తి రూ.10 వేల చొప్పున పంపిణీ షురూ చేశారు. ఇది తెలిసి మొదలు పంపిణీ షురూ చేసిన అభ్యర్థి మళ్లీ రూ.3వేల చొప్పున పంపిణీ చేశారు. ఇలా ముగ్గురూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు పోటీపడ్డారు. కానీ అత్యధిక మెజార్టీతో రాజకీయంగా అనుభవం లేని వ్యక్తి విజయం సాధించారు. ఈ వ్యక్తి పదవి కోసం ఇప్పటికే రూ.6కోట్ల వరకు ఖర్చు చేశాడని జిల్లాలో ప్రజలు చర్చించుకుంటున్నారు.
కౌన్సిలర్ గెలిస్తే ఏం వస్తుంది ....
ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను మున్సిపాలిటీ కౌన్సిలర్ గా ప్రకటిస్తుంది. కౌన్సిలర్ గా ఉన్నవారు మున్సిపల్ చైర్మన్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ ను ఎన్నుకుంటారు. మున్సిపాలిటీ చైర్మన్ జీతం నెలకు రూ.19500 ఉండగా వైస్ చైర్మన్ జీతం రూ.9250 గా ఉంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా సూర్యాపేట లో కౌన్సిలర్ కు నెలకు రూ.4,550 గౌరవ వేతనం లభిస్తుంది. వార్డు పరిధిలో ప్రొటోకాల్ ఉంటుంది. అన్ని అధికారిక కార్యక్రమాల్లో కౌన్సిలర్ కు భాగస్వామ్యం ఉంటుంది. రాజకీయంగా గౌరవం ఉంటుంది. కానీ ఎన్నికల్లో చేసిన ఖర్చులను తలచుకుని గెలిచిన అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులు వణికిపోతున్నారు. ఎన్నికల్లో ఒక్కో వార్డు కు రూ.50 లక్షల పైగా ఖరీదు కావడం దారుణం.






