కొడుకు ఇంటి నుంచి గెంటేసాడని వృద్దురాలి ఆవేదన

by Bhanu |   (  Updated:2025-05-19 11:14:04  IST  )

తన వృద్దాప్యంలో ఒక్కకానొక్క కొడుకు తిండి పెట్టకుండా ఇంటి నుంచి బయటికి గెంటెసాడని గుండాల మండలం అనంతారం గ్రామానికి చెందిన వృద్దురాలు ఆది కమలమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

కొడుకు ఇంటి నుంచి గెంటేసాడని వృద్దురాలి ఆవేదన
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తన వృద్దాప్యంలో ఒక్కకానొక్క కొడుకు తిండి పెట్టకుండా ఇంటి నుంచి బయటికి గెంటెసాడని గుండాల మండలం అనంతారం గ్రామానికి చెందిన వృద్దురాలు ఆది కమలమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిసి తన గోడు వెళ్ళబోసుకుంది. తన భర్త అది కిష్టయ్య, తన పేరున గల పట్టా భూమిని అక్రమంగా, బెదిరింపులకు పాల్పడి, నమ్మబలికి, నమ్మక ద్రోహంతో తన కొడుకు అది నర్సయ్య తండ్రి కిష్టయ్య గిఫ్ట్ పట్టా చేసుకొని, ముసలి వయసులో తనకు తిండిపెట్టకుండా, ఇంటి నుండి బయటకు గెంటివేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే అనంతారంకు చెందిన ఆది కమలమ్మ కిష్టయ్యలకు నలుగురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు‌. తన భర్త పేరునా అనంతారం రెవెన్యూలోని సర్వేనెంబర్లు 37, 38, 41, 45, 46, 47, 49లలో 4-31 ఎకరాల భూమి ఉండేదన్నారు. తమ కొడుకు పూర్తిగా తమను పట్టించుకోకుండా, కనీసం తిండికూడా పెట్టేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక రోజు తన భర్తను తీవ్రంగా కొట్టి, పిడిగుద్దులు గుద్ది, బెదిరింపులకు పాల్పడి తన భర్త పేరున పట్టా గల భూమిలోనుండి 3-12 ఎకరాలు గిఫ్ట్ డీడ్ క్రింద పట్టా చేయించుకున్నాడని చెప్పింది. గిఫ్ట్ చేసిన వారం రోజులకే తన కొడుకు కొట్టిన దెబ్బలకు, పిడిగుద్దులకు తాళలేక భర్త కిష్టయ్య 2021లో మరణించినట్లు చెప్పింది.


భర్త మరణానంతరం సమాజం దృష్టిలో మంచిపేరు తెచ్చుకోవడానికి తన కుమారుడు ఫౌతి ద్వారా అతను పట్టా చేసుకోగా, మిగిలిన భూమిని 1-19 ఎకర భూమిని తన పేరున పట్టా చేయించాడన్నారు. అప్పటి నుంచి‌ కూడ తన కొడుకు, కోడలు మానసికంగా, శారీరకంగా హింసిస్తూ నాకు తిండి పెట్టకుండా పస్తులు ఉంచారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తన పేరున పట్టా గల భూమిని భవిష్యత్తులో తన కూతుర్ల‌ పేరు మీద చేస్తాననే అనుమానంతో తనతో మంచిగా ఉన్నట్లు నటించి, అసరా పింఛను ఇప్పిస్తానని, ఆఫీసుకు అని తీసుకువెళ్ళి నాతో వేలిముద్రలు వేయించుకొని తన పేరు మీద ఉన్న భూమిని చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. కొంత కాలం తర్వాత నాకు రైతుబంధు రాకపోవడంతో గ్రామాధికారులను అడుగగా తన పేరుపై భూమి లేదనే విషయం తెలుసుకున్నట్లు చెప్పింది. దీనిపై తన కొడుకు కోడలు ప్రశ్నించగా వారు పట్టించుకోకుండా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేసింది‌. తాను ప్రస్తుతం అనంతారం గ్రామపంచాయతీ ప్రక్కనే వున్న శిథిలావస్థలోవున్న పెంకుటింట్లో తలదాచుకుంటున్నట్లు చెప్పింది. దయ చేసి జిల్లా అధికారులు ఈ విషయంపై చొరవ చూపి తన పేరు పట్టా భూములను బెదిరించి తన కొడుకు చేసుకున్న పట్టాను తిరిగి తనపై చేయించాలని కలెక్టర్ ను వేడుకుంది.

Next Story