- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి: డీఎస్పీ శ్రీనివాసరావు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఆదివారం మర్రిగూడ నాంపల్లి మండలాల్లోని సమస్యత్మక గ్రామాలలో ఓటు హక్కు పై ప్రజలకు అవగాహన కల్పించారు.

దిశ, మర్రిగూడ: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఆదివారం మర్రిగూడ నాంపల్లి మండలాల్లోని సమస్యత్మక గ్రామాలలో ఓటు హక్కు పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మర్రిగూడ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా బెదిరింపులకు పాల్పడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఎన్నికలలో పోలింగ్ రోజు గొడవలు చేసిన ఎలక్షన్ కేసులు నమోదు చేసి అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రాజు, మర్రిగూడ నాంపల్లి ఎస్ఐలు కృష్ణారెడ్డి, లింగారెడ్డి పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






