ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శృతి ప్రసవం

by Ratna Kumari |

ప్రభుత్వ హాస్పటల్లో సరైన వైద్యం అందదు అనే ప్రచారం విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్లోనే పని చేస్తున్న డాక్టర్ అదే హాస్పటల్ లో ప్రసవించిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శృతి ప్రసవం
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : ప్రభుత్వ హాస్పటల్లో సరైన వైద్యం అందదు అనే ప్రచారం విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్లోనే పని చేస్తున్న డాక్టర్ అదే హాస్పటల్ లో ప్రసవించిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. నేరేడుచర్ల PHC లో ఆయుర్వేద్ డాక్టర్ గా పనిచేస్తున్న ఆర్ .శృతి మంగళవారం ప్రసవించింది. శృతి కాన్పు నొప్పులతో ఉదయం 4:20 గంటలకు ఉమ్మనీరు అంతా కోల్పోయి నేరెడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగిందనీ.. PHC డాక్టర్ పున్న నాగిని మంగళవారం విలేకరులకు తెలిపారు. సకాలం లో స్పందించి అవసరమైన అన్నీ వైద్య పరీక్షలు నిర్వహించి మంగళవారం మధ్యాహ్నం 1: 55 నిమిషాలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. బరువు కూడా 2.8 కేజీల ఉందన్నారు. సాధారణ కాన్పు చేశామ‌ని.. ప్ర‌స్తుతం తల్లి, బిడ్డలను సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

Next Story