అత్యాశకు పోవద్దు సైబర్ మోసగాళ్ల బారిన పడొద్దు

by Ratna Kumari |

అత్యాశ‌కు పోయి సైబ‌ర్ మోస‌గాళ్ల బారిన ప‌డొద్ద‌ని చిక్క‌డ‌ప‌ల్లి ఏసీపీ ఎల్. ర‌మేష్ కుమార్ సూచించారు.

అత్యాశకు పోవద్దు సైబర్ మోసగాళ్ల బారిన పడొద్దు
X

దిశ, రాంనగర్ : అత్యాశ‌కు పోయి సైబ‌ర్ మోస‌గాళ్ల బారిన ప‌డొద్ద‌ని చిక్క‌డ‌ప‌ల్లి ఏసీపీ ఎల్. ర‌మేష్ కుమార్ సూచించారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ లో మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అధ్వర్యంలో హైదరాబాద్ ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సందేశం మేరకు జాగృత్ హైదరాబాద్, సురక్షిత్ హైదరాబాద్ అనే ప్రజా అవగాహన కార్యక్రమాన్నిచిక్కడపల్లి పోలీస్ సిబ్బంది, వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ ప్రెసిడెంట్ ఎస్ మనోహర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఏసీపీ ఎల్. ర‌మేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసే సైబర్ నేరాలు వివిధ రకాలుగా జరుగుతున్నాయన్నారు. వాటిలో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఓటిపి, కేవైసీ, డిజిటల్ అరెస్ట్, సెక్స్టోర్ష న్ , హనీ ట్రాప్, ఓఎల్ఎక్స్, జాబ్, వీసా బిజినెస్, వాట్సాప్ డీపీ, పలు రకాల సైబర్ క్రైమ్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని అవ‌గాహ‌న క‌ల్పించారు.


ప్రతి కాల్, మెసేజ, లింకును ఆలోచించి మాత్రమే స్పందించాలన్నారు. ప్రతి ఒక్కరి తమ, తమ జాగ్రత్తే మేలు అని, నిర్లక్ష్యం వహిస్తేనే నష్టంమన్నారు. అనుమానస్పద కాల్స్, లింక్స్, యాప్లను నమ్మొద్దు అన్నారు. ఓటీపీలు, పాస్వర్డ్ , బ్యాంకు వివరాలు ఎవరితోనో పంచుకోవద్దని, బలమైన పాస్వర్డ్ వాడాలని తెలిపారు. యువత మహిళలు, ప్రతి ఒక్కరు అవసరంలేని సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత సమాచారం పంచుకోకుండా అపరిచితులకు దూరంగా ఉండాలన్నారు. అదేవిధంగా అపరిచితులు పంపించే లింకులు, ఏపీకే పైళ్లను ఎట్టి పరిస్థితులను ఓపెన్ చేయ‌వ‌ద్దు అన్నారు. పోలీస్ ఒక్కరే కారు ప్రజలు సమాజం ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఇంట్లో సామాజిక బాధ్యతగా సిటీ పోలీస్ కమిషనర్ పిలుపు మేరకు సైబర్ శింబగా ఉండి భాగస్వాములు కావాలన్నారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ మల్లేశం, ఎస్సైలు అభిలాష్, కరీం, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్, పోలీస్ సైబర్ వారియర్స్ జౌర ఫాతిమా, పోలీస్ సిబ్బంది,వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ ప్రెసిడెంట్ ఎస్ మనోహర్ రెడ్డి. ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వి నాగభూషణం పాల్గొన్నారు.

Next Story