- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జానారెడ్డికి ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ గుర్తొచ్చిందా..?
పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత అని, ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

దిశ,చౌటుప్పల్: పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత అని, ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిని పెంచి రైతులకు ఇంకా మంచి చేసేల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం చౌటుప్పల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో.. ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గతంలో పాలించిన పార్టీ ఒక కుటుంబ పార్టీ, రాచరికంతో కొనసాగిన పార్టీ , వారికి వంగి వంగి దండాలు పెట్టిన వారికే మంత్రి పదవులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని గుర్తు చేశారు. కరెంటు గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదని, కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నారు. రైతు రుణమాఫీ కొంతమంది రైతులకు ఇవ్వాల్సి ఉంది అది వాస్తవమేనన్నారు. డబల్ బెడ్ రూమ్ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పేదలను మోసం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తుందన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పాలయ్యారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీరు అందించే బాధ్యత తనదేనన్నారు. ప్రభుత్వం పెట్టిన సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి ఇస్తానని మళ్ళీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్థానన్నారు. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుందన్నారు. ఒకాయన అంటాడు ఒక ఇంట్లో ఇద్దరి మంత్రి పదవులు ఇస్తారా అని దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్లో యూసుఫ్ పటాన్, ఇర్ఫాన్ పటాన్ ఇద్దరు అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహిస్తే లేనిదే మంత్రి పదవులు ఇద్దరు చేస్తే తప్పా అన్నారు. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు కెపాసిటిని బట్టి వస్తుందన్నారు. 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి కి ఈరోజు రంగారెడ్డి, హైదరాబాద్ కు మంత్రి పదవి ఇవ్వాలని గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ లాంటి జిల్లాల్లో మంత్రుల కు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన ఎంపి లు గెలవలేదు, భునగిరిలో ఒక ఎమ్మెల్యేగా నేను గెలిపించానని గుర్తుచేశారు. కేసిఆర్ ను గద్ద దింపాలని లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కేసీఆర్ ను గద్దె దింపిన అది నా కమిట్మెంట్ అన్నారు.నా మంత్రి పదవి విషయంలో కొందరు దుర్మార్గులు జానా రెడ్డి లాంటి వ్యక్తులు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారన్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే గల్ల ఎగరేసుకొని ఉంటాడే తప్పా అడుక్కునే పొజిషన్లో ఉండడని హాట్ కామెంట్స్ చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు.






