స్వార్థం కోసమే సస్పెండ్: జిల్లా కాంగ్రెస్ నాయకుడు గుర్రం లక్ష్మారెడ్డి

by Bhanu |

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం తనను, తన అనుచరుడిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకుడు గుర్రం లక్ష్మారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

స్వార్థం కోసమే సస్పెండ్: జిల్లా కాంగ్రెస్ నాయకుడు గుర్రం లక్ష్మారెడ్డి
X

దిశ, వలిగొండ: కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం తనను, తన అనుచరుడిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకుడు గుర్రం లక్ష్మారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పంచాయతీ ఎన్నికలల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి నోముల మల్లేష్ యాదవ్, 9 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో ప్రజామోదం ఉన్న వ్యక్తిని కాదని, దేశబోయిన బాలస్వామి అనే వ్యక్తిచే నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందనగా ఎటువంటి వార్డు సభ్యుల ప్యానల్ లేకుండా, ఒక్కనిచే నామినేషన్ వేయించాడని గుర్రం లక్ష్మారెడ్డి తెలిపారు. అంతకు మందు కాంగ్రెస్ పార్టీ నుండి నోముల మల్లేశం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉన్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ నుండి మరొకరిచే నామినేషన్ వేయించి గ్రామ ప్రజలను గందరగోళంలోకి నెట్టిండని గుర్రం లక్ష్మారెడ్డి ఆరోపించారు.

నామినేషన్ పంచాయతీ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వద్దకు చేరిన క్రమంలో కూర్చొని మాట్లాడుకొండని, కుదరని పక్షంలో గెలిచిన అభ్యర్ధికే తన మద్దతుందని స్పష్టంగా చెప్పాడని గుర్రం లక్ష్మారెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాలుగా మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలబడిన తనను, తన అచరుడు నోముల మల్లేశంను, పార్టీ నుంచి సస్సెండ్ చేసే అధికారం ఎవరికి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉండి తాను స్వచ్ఛందగా చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తనకు పార్టీలో సముచిత స్థానం ఇస్తానని చెప్పి అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో 300 మంది అనుచరులతో పార్టీలో చేరామని, తనను, తన అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేసే అధికారం ఎవరికి లేదన్నారు. తన రాజకీయ పబ్బం కోసం తన ఎదుగుదలను చూసి ఓర్వలేక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి తనను సస్పెండ్ చేయడం సహించలేనిదన్నారు. కనీసం గ్రామంలో వార్డు సభ్యునిగా పోటీ చేసి గెలువలేని మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి పోకడ మండలంలో కాంగ్రెస్ పార్టీకీ తీవ్ర నష్టం చేస్తుందని, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కోసం పాశం సత్తిరెడ్డి నుండి బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్లరేపాక గ్రామంలో పోటీ చేస్తున్న వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story