రెండవ దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

by Bhanu |

రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు

రెండవ దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
X

దిశ, సూర్యాపేట: రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం కలెక్టర్ చివ్వెంల, మోతే, నడిగూడెం, కోదాడ, అనంతగిరి, చిలుకూరు మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండవ విడత పోలింగ్‌ ఎనిమిది మండలాలు కలుపుకొని మొత్తం 181 గ్రామపంచాయతీలు కాగా, ఇందులో ఏకగ్రీవం తరువాత 158 గ్రామపంచాయతీలు, 1460 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఇందుకుగాను 1462 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశామని, పోలింగ్ సిబ్బంది అందరికీ శిక్షణ ఇచ్చి విధులు కేటాయించామని వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది అందరూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి బయలుదేరి వారికి కేటాయించిన గ్రామపంచాయతీలకు చేరుకొని ప్రణాళిక ప్రకారం పోలింగ్ ఏర్పాట్లు చేసుకుంటారని వెల్లడించారు. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు ప్రతి ఒక్కరు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, ఎంపీడీవో ఇషాక్ హుస్సేన్, తాసిల్దార్ వాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Next Story