పోలింగ్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి: కలెక్టర్

by Bhanu |

పోలింగ్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. బుధవారం ఆయన జాజిరెడ్డి గూడెం మండల పోలింగ్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించారు. పీఓలు, ఏపీవోలు పోలింగ్ సామాగ్రిని, బ్యాలెట్ బాక్స్‌లను జాగ్రత్తగా పరిశీలించి, తీసుకోవాలన్నారు.

పోలింగ్ సిబ్బంది  బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి: కలెక్టర్
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): పోలింగ్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. బుధవారం ఆయన జాజిరెడ్డి గూడెం మండల పోలింగ్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించారు. పీఓలు, ఏపీవోలు పోలింగ్ సామాగ్రిని, బ్యాలెట్ బాక్స్‌లను జాగ్రత్తగా పరిశీలించి, తీసుకోవాలన్నారు. అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో మరోసారి పరిశీలించుకోవాలని చెప్పారు. రిజర్వు సిబ్బందికి ఏదో ఒక గ్రామ పంచాయతీలో విధులు కేటాయించడం జరుగుతుందని, సిబ్బంది అందరూ వారికి కేటాయించిన గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్లకు జోనల్ ఆఫీసర్‌తో వెళ్లి పోలింగ్ స్టేషన్‌కు చేరుకొని అక్కడ రాత్రి బస చేయాలన్నారు. సాయంత్రం సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకోగానే ఆ పోలింగ్ స్టేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, పోలింగ్‌కు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించాలని, మధ్యాహ్నం 1 తర్వాత ఓటర్లు ఓట్లు వేసేందుకు క్యూ లైన్లో ఉన్నట్లయితే పై అధికారుల అనుమతితో పోలింగ్ నిర్వహించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల పరిధిలో శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని, ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మండల టీంకు సమాచారం అందిస్తే.. అవసరమైతే అదనపు పోలీస్ సిబ్బందిని పంపించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఓట్ల లెక్కింపులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రజాస్వామ్య పద్ధతిలో లెక్కింపు జరపాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓట్ల లెక్కింపు పూర్తయిన స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లు ఫలితాలు వెల్లడించే, ముందు జిల్లా ఎన్నికల అధికారి, జనరల్ అబ్జర్వర్ అనుమతి తీసుకొని తుది ఫలితాలు ప్రకటించాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలక్షన్ సెల్‌కు ఫోన్ కాల్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా అనుమతి తీసుకొని ఫలితాలు ప్రకటించాలని సూచించారు. ప్రతి ఎన్నికల సిబ్బంది బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించి, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ రావు, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, తహశీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ఝాన్సీ, ఎంపీవో గోపి, ఎంఈఓ బాలునాయక్, ఇతర అధికారులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story