- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలింగ్ సామాగ్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు
మొదటి విడత ఎన్నికలు జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ సామాగ్రిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. అనంతరం సర్వపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.

దిశ, ఆత్మకూరు: మొదటి విడత ఎన్నికలు జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ సామాగ్రిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. అనంతరం సర్వపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వారిగా సపరేట్ చేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉండాల్సిన బ్యాలెట్ బాక్స్‌ను ఓపెన్ చేసి చూసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్లు కూడా అన్ని సరిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
స్వస్తి గుర్తు కూడా సరిగ్గా వచ్చిందా లేదా అని చెక్ చేయాలి, మార్కింగ్ కూడా చెక్ చేసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బందికి మంచి భోజనం మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధులకు దివ్యాంగులకు వీల్ చైర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని పిల్లల తల్లుల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాములు నాయక్, సంబంధించి అధికారులు పాల్గొన్నారు.






