విద్యార్థులకు నోటుబుక్స్, బ్యాగులు పంపిణీ

by velandi.Saikiran |

విద్యార్థులకు నోటుబుక్స్, బ్యాగులు పంపిణీ
X

దిశ, పెద్ద అడిశర్లపల్లి: బాలాజీనగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో శనివారం యూత్ ఫర్ సేవాసంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత బ్యాగులు, నోట్ బుక్ లు, ఇతర స్టేషనరీ సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎ.వెంకటయ్య పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేయూతనివ్వడం మంచిదన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యాభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె.మూనా, ఉపాధ్యాయులు, సతీష్, జైశంకర్, రవి, యుగంధర్, యూత్ ఫర్ సేవా వాలంటీర్ మెగావత్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story