దేవరకొండలో 407 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ : ఎమ్మెల్యే బాలు నాయ‌క్

by Nallavelli.Anjaneyulu |

దిశ, దేవరకొండ టౌన్ : పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

దేవరకొండలో 407 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ :  ఎమ్మెల్యే బాలు నాయ‌క్
X

దిశ, దేవరకొండ టౌన్ : పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని సాయి శివ గార్డెన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 407 మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. మొత్తం రూ. 4 కోట్ల 07 లక్షల 06 వేల 512 /- రూపాయల విలువగల ఈ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే అనేక ప్రజా ప్రయోజనకరమైన పనులను చేపట్టిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి పథకం), గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే వైద్య సేవలను 10 లక్షల రూపాయలకు పెంపు, పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లపై బోనస్ అందిస్తూ, కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు వంటి ఎన్నో హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన వివరించారు.

Next Story