రేపు నల్గొండలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ

by Nallavelli.Anjaneyulu |

దిశ, నల్లగొండ, కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

రేపు నల్గొండలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పై శుక్రవారం సాయంత్రం ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 22 న జిల్లా కేంద్రంతో పాటు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఆదివారం, సోమవారం రెండు రోజుల్లో గ్రామస్థాయిలో చీరల పంపిణీ పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ చీరలను పంపిణీ చేయాలన్నారు. గ్రామస్థాయిలో చీరల పంపిణీకి పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ నామిని గా ఉంటారని, గ్రామ సమాఖ్య, వీఓఓబీ సభ్యులుగా ఉంటారని, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని చీరల పంపిణీ చేపట్టాలని, చీరలు పొందిన ప్రతి ఒక్కరి నుంచి చీరను తీసుకున్నట్టు ఆక్విటెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే చీరల పంపిణీకి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పిలవాలని, అలాగే మండల స్థాయిలో సైతం సంబంధిత ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు.

ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ లో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని శనివారం ఉదయాదిత్య‌ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించ‌నున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని, వారి చేతుల మీదుగా చీరల పంపిణీ ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆమె అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో ఇందిర మహిళల శక్తి చీరల పంపిణీలో భాగంగా 4 లక్షల 34 వేల చీరలు అవసరం కాగా, ఇప్పటివరకు ప్రభుత్వం నుండి 3 లక్షల 50 వేల చీరలు జిల్లాకు వచ్చాయి. తక్కిన 84 వేల చీరలు శనివారం జిల్లా కేంద్రానికి రానున్నాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, నల్గొండ ఆర్డిఓ అశోక్ రెడ్డిలు మాట్లాడారు. స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ, అమిత్, ఆర్డీవోలు, మండలాల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గాల ఇన్చార్జ్ అధికారులు డీపీఎంలు, ఏపీఎంలు హాజరయ్యారు.

Next Story