- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవరకొండ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు
దిశ, దేవరకొండ: దేవరకొండ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అసమ్మతి నాయకులను మంచిగా చేసుకోవడంలో ఎమ్మెల్యే రవీంద్రనాయక్ విఫలం చెందాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధిష్టానం అసమ్మతి నాయకుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి మంచిగా చేసుకోవాలని చెప్పినప్పటికీ దేవరకొండ ఎమ్మెల్యే గత 3ఏళ్లుగా అసమ్మతి నాయకులను పట్టించుకోకపోవడంతో మళ్లీ రవీంద్రకుమార్ కి పార్టీ టికెట్ ఇవ్వడంతో దేవరకొండలో ఇప్పటికే వడిత్య దేవేందర్ నాయక్ వర్గం వేరే కుంపటి పెట్టి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వివిధ మండలాల్లో సమావేశాలు సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పార్టీ చెప్పింది కదా అని అసమ్మతి నాయకుల ఇండ్ల వద్దకు వెళ్లినా.. ఎవరు కూడా ఆయనతో మాట్లాడడానికి అయిష్టత చూపడంతో తూతూ మంత్రంగానే వారితో మాట్లాడి వస్తున్నారు. బుధవారం నేరడిగొమ్ము మండలంలోని కాచరాజుపల్లిలో శుద్ధబాయితండాలో అసమ్మతి నాయకుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఒక ఎస్టీ ఎమ్మెల్యే అయి ఉండి దొరల కంటే ఎక్కువ పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యేను శుభకార్యానికి ఆహ్వానించేందుకు పట్టణంలోని కొంతమంది ప్రముఖులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తే మమ్మల్ని అడ్డుకున్నారని మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మండల ప్రజా ప్రతినిధిగా నాలుగేళ్ల కాలంలో ఏనాడు కూడా ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలలో నన్ను భాగస్వామ్యం చేయలేదని ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్ మండిపడ్డారు. వైస్ ఎంపీపీ, జడ్పీటీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోటోకాల్ విషయంలో తనను అవమానపర్చారన్నారు.
ఈ కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు శిరందాస్ కృష్ణయ్య, మాజీ డీసీఎంఎస్ సంకేపల్లి వీరారెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ దొంతినేని యాదగిరిరావు, ఎంపీటీసీ హనుమంత రెడ్డి, బిక్కునాయక్, సర్పంచులు, మాజీ సర్పంచులు దొంతినేని దామోదర్ రావు, బిక్కనాయక్, రాములు, పాత్లావత్ ధర్మానాయక్, నేనావత్ భరత్ కుమార్, ఎన్నిమల్ల రమేష్, వంశీ, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.