నిష్ప‌క్ష‌పాత వార్త‌ల‌కు నిలువుటద్దం 'దిశ': కలెక్టర్ హనుమంతరావు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, యాదాద్రి కలెక్ట‌రేట్ : నిష్పక్షపాత వార్తలకు నిలువుటద్దం "దిశ" దినపత్రిక అని యాదాద్రి భువ‌న‌గిరి కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

నిష్ప‌క్ష‌పాత వార్త‌ల‌కు నిలువుటద్దం దిశ: కలెక్టర్ హనుమంతరావు
X

దిశ‌, యాదాద్రి కలెక్ట‌రేట్ : నిష్పక్షపాత వార్తలకు నిలువుటద్దం "దిశ" దినపత్రిక అని యాదాద్రి భువ‌న‌గిరి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ లో దిశ దినపత్రికకు సంబంధించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికితీయడంలో దిశ దినపత్రిక ముందుందన్నారు. పత్రిక స్థాపించిన అతి కొద్ది కాలంలోనే డిజిటల్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ.. ప్రజలకు పారదర్శకమైన వార్తలను అందిస్తుందన్నారు. డైనమిక్ ఎడిషన్ ల ద్వారా ఎప్పటి వార్తలు అప్పుడే పాఠకులకు అందిస్తూ ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దిశ దినపత్రిక స్టాపర్ జి.మహేష్, రిపోర్టర్లు గుండె బాబు, వంశీ, కట్ట శ్రీను, ఉదయ్, స్వామి పాల్గొన్నారు.

Next Story