10న కలెక్టరేట్ ఎదుట ధర్నా.. పవన్ మాటల వెనుక బీజేపీ హస్తం

by Kodari Anjali |

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఈనెల 10న నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి, శాసనమండలి నెల్లికంటి సత్యం తెలిపారు.

10న కలెక్టరేట్ ఎదుట ధర్నా.. పవన్ మాటల వెనుక బీజేపీ హస్తం
X

దిశ, నల్లగొండ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఈనెల 10న నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి, శాసనమండలి నెల్లికంటి సత్యం తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం పది రోజుల్లోనే రూ. 11 ధర పెరిగిందని తెలిపారు. పెరిగిన ధరల వల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వ్యతిరేకిస్తూ జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావాలని ఆయన కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యల వెనుక బిజెపి హస్తం ఉందని ఆయన విమర్శించారు. బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల పూర్తి వ్యతిరేకతో వ్యవహరిస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు, మాజీ సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, నరసింహారెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Next Story