- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పనులతో ప్రతిపక్షాల్లో వణుకు పుడుతోంది: కూసుకుంట్ల
అభివృద్ధి పనులతో ప్రతిపక్షాల్లో వణుకు పుడుతోందని, నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లను నిర్మిస్తుండడంతో దశాబ్దాల పల్లెల కల నెరవేరబోతుందని మునుగోడు ఎమ్మెల్య కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

దిశ, చండూరు: అభివృద్ధి పనులతో ప్రతిపక్షాల్లో వణుకు పుడుతోందని, నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్లను నిర్మిస్తుండడంతో దశాబ్దాల పల్లెల కల నెరవేరబోతుందని మునుగోడు ఎమ్మెల్య కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నెర్మట, జోగిగూడెం, తిమ్మారెడ్డి గూడెం, చొప్పరివారిగూడెం, పడమటి తాళ్ల, దుబ్బగూడెం, శిర్థపల్లి గ్రామాలల్లో బీటీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల వరకు అభివృద్ధి లేక వెలవెలబోయిన పల్లెలు ఉప ఎన్నిక తర్వాత అభివృద్ధి పనులతో కలకళలాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. చేయని పనులు చేసినట్టు చెప్పుకొని కొందరు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. అభివృద్ధి కావాలంటే మళ్లీ కేసీఆర్ కు పట్టం కట్టాలని ప్రజలను కోరారు.
అనంతరం గాంధీ జయంతి సందర్బంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కల్యాణి, జడ్పీటీసీ వెంకటేశం, ఎంపీడీవో యాకుబ్ నాయక్, సర్పంచులు నందికొండ నర్సిరెడ్డి, కొండరెడ్డి వెంకట్ రెడ్డి, చొప్పరి అనురాధ వెంకన్న, మేకల వెంకన్న, నాయకులు కోడి వెంకన్న, గుర్రం వెంకట్ రెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, బొడ్డు సతీష్, యత్తపు మధుసూదన్ రావు, ఉజ్జిని అనిల్ రావు, పంచాయతీ రాజ్ డీఈ, ఏఈ, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.






