- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
దిశ, భూదాన్ పోచంపల్లి : గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి

దిశ, భూదాన్ పోచంపల్లి : గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ ముఖి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పిల్లాయిపల్లి, పెద్దగూడెం, జూలూరు గ్రామాలలో బిటి రోడ్డులను ప్రారంభించారు. పిల్లాయిపల్లి గ్రామంలోని గౌడ సంఘం భవన నిర్మాణ పనులను పరిశీలించి పెద్దగూడెం గ్రామంలో గౌడ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. గత 26 సంవత్సరాలుగా ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టింపులేనట్లు వ్యవహరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలోపే సమస్యను పరిష్కరించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, డిసిసి ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్,నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కాసుల అంజయ్య గౌడ్, ఫకీరు నర్సిరెడ్డి, భూషణ్, తోట శ్రీనివాస్, పడాల సతీష్ చారి, ఉప్పునూతల వెంకటేష్ యాదవ్, దాసర్ల జంగయ్య, కాసుల మల్లేష్ గౌడ్, సుర్వి వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.






