- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే
నియోజకవర్గంలో అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కోదాడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

X
దిశ, చిలుకూరు: నియోజకవర్గంలో అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కోదాడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆయన శనివారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. వచ్చే అయిదేళ్లలో ఏం అభివృద్ధి చేయబోతున్నామో చెప్పేందుకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోనే నిదర్శనమని ఆయన అన్నారు. పచ్చని నియోజవర్గంలో చిచ్చు పెట్టాలని చూస్తూ పార్టీని వీడిన నాయకులకు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే సమాధానం కావాలన్నారు. స్థానిక అభ్యర్థినైన నన్ను మరోసారి దీవించాలని మల్లయ్య యాదవ్ ఓటర్లను కోరారు. కనీసం మ్యానిఫెస్టో కూడా సొంతంగా తయారుచేసుకోలేని దీనావస్థలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






