మృతి చెందిన ఉపాధ్యాయురాళ్లకు దేవరకొండ యూటీఎఫ్ సంతాపం

by Nallavelli.Anjaneyulu |

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సమీపంలో శనివారం జరిగిన ఆకస్మిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయురాళ్లు గీత, కల్పన కి దేవరకొండ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) సంతాపం వ్యక్తం చేసింది.

మృతి చెందిన ఉపాధ్యాయురాళ్లకు దేవరకొండ యూటీఎఫ్ సంతాపం
X

దిశ, దేవరకొండ టౌన్ : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సమీపంలో శనివారం జరిగిన ఆకస్మిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయురాళ్లు గీత, కల్పన కి దేవరకొండ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) సంతాపం వ్యక్తం చేసింది. ఈ విషాద ఘటన నేపథ్యంలో దేవరకొండ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంతాప సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ఉపాధ్యాయురాళ్లు ఇద్దరు విద్యారంగానికి చేసిన విశిష్ట సేవలను, విద్యార్థుల అభివృద్ధికి వారు పడిన తపనను యూటీఎఫ్ నాయకులు, సభ్యులు గుర్తుచేసుకున్నారు. వారి మరణం విద్యా రంగానికి తీరని లోటని అభివర్ణించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులు రెండు నిమిషాలు మౌనవ్రతం పాటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఈ కష్టకాలంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సంతాప కార్యక్రమంలో యూటీఎఫ్ ఎంజేపీ స్టేట్ సెక్రటరీ కొండపల్లి శ్రీను, జిల్లా కార్యదర్శి గంటల వెంకట్, దేవరకొండ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి అంకురి సతీష్, పి.గోవర్ధన్ రావు, చాట్ల ఇద్దయ్య, అంజయ్య, మధు, దేవరకొండ కస్తూరిబా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) సావిత్రి, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story