- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైప్ లైన్ కోసం పంట పొలాలను ధ్వంసం చేయడం సరికాదు: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పెరుమల్ల సతీష్
రైతుల పంట పొలాలను పైప్ లైన్ పేరుతో ధ్వంసం చేయడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పెరుమల్ల సతీష్ అన్నారు.

దిశ నేరేడుచర్ల (పాలకవీడు): రైతుల పంట పొలాలను పైప్ లైన్ పేరుతో ధ్వంసం చేయడం సరికాదని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పెరుమల్ల సతీష్ అన్నారు. శుక్రవారం పాలకీడు మండలంలోని కృష్ణా నదిపై ఏర్పాటు చేసిన జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ పనులలో భాగంగా పైపులైన్లు వేయడం కోసం కోమటికుంట గ్రామంలోని రైతులు రెండు నెలల క్రితం వేసిన నాట్లను జెసిపితో గుంతలు తవ్వి ధ్వంసం చేయడం సరికాదన్నారు. చెరువు తండా, కొత్త తండా, కోమటికుంట గ్రామ రైతులు ఈ పైపులైన్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఒక్క నెల రోజులు అయితే ఆ పంట పొలాలను కోతలు కోసుకుంటారు.
దాని తర్వాత ఈ పైప్ లైన్ పనులను ప్రారంభిస్తే ఎవరికి ఎటువంటి నష్టం ఉండదని అన్నారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దయచేసి ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడి ఈ ఒక్క నెల రోజులు ఆ పైప్ లైన్ పనులను ఆపాలని రైతుల తరపున విజ్ఞప్తి చేశారు. పైప్ లైన్ పనులను ఆపకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పంట పొలాలలోనే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు హనుమానాయక్, శ్రీకాంత్, వీరయ్య, అంజి, ముక్త, గంగమ్మ, బాల సైదులు తదితరులు పాల్గొన్నారు.






