ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-14 14:09:50  IST  )

దిశ, మునుగోడు : మునుగోడు మండలంలోని కిష్టాపురం గ్రామంలో ఈనెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీఆర్ఎస్

ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి మృతి
X

దిశ, మునుగోడు : మునుగోడు మండలంలోని కిష్టాపురం గ్రామంలో ఈనెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపురం గ్రామానికి చెందిన చెనగొని కాటంరాజు( 45) సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ నుండి పోటీ చేశాడు. గత బుధవారం జరిగిన ఎన్నికల్లో సమీప అభ్యర్థి పై 143 ఓట్లతో ఓడిపోయాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం స్వగ్రామంలో ఓ వ్యక్తి ఇంటిదగ్గర మాట్లాడుతూ హఠాత్తుగా సొమ్మసిల్లీ పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ యశోద హస్పెటల్ కు తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాటంరాజు అకాల మృతి పట్ల ఆ గ్రామంలోని ప్రజలు శోకసముద్రంలో ఉన్నారు.

Next Story