సాయుధ రైతాంగ పోరాట యోధుని మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, చిలుకూరు : మండలంలోని ఆచార్యులగూడెంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కురు వృద్ధుడు ముసి కనకయ్య(102) గురువారం మృతి చెందారు.

సాయుధ రైతాంగ పోరాట యోధుని మృతి
X

దిశ, చిలుకూరు : మండలంలోని ఆచార్యులగూడెంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కురు వృద్ధుడు ముసి కనకయ్య(102) గురువారం మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. గురువారం జరిగిన ఆయన అంత్యక్రియలకు టీపీసీసీ అధికార ప్రతినిధి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ వంగవీటి రామారావు, జెడ్పీ మాజీ సభ్యుడు నాగేంద్రబాబు, మాజీ ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య హాజరై కనకయ్యకు నివాళులర్పించారు.

Next Story