- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధునిక సమాజంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి
ఆధునిక సమాజంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామారావు అన్నారు.

దిశ, గరిడేపల్లి : ఆధునిక సమాజంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామారావు అన్నారు. గురువారం హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విభాగం -I స్పెషల్ క్యాంప్ లో భాగంగా ఐదవ రోజు గరిడేపల్లి మండల పరిధిలోని రాయిని గూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ రామారావు మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరగడం వలన ఎక్కువమంది విద్యార్థులు, అంతేకాకుండా సమాజంలోని ఎన్నో కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు సైబర్ నేరాల బారిన పడుతున్నారని అన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కలిగిన విద్యార్థులు తమ యొక్క కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడే విధంగా అవగాహన కల్పించాలాన్నారు.ఈ కార్యక్రమానికి హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ల బృందం హాజరై విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేసిన సేవలను ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్-I, యూనిట్ -II అధికారులు బి.నాగార్జున, ఎస్ .బాలరాజు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.






