రోడ్డు ప్రమాదంలో CRPF జవాన్ మృతి

by velandi.Saikiran |

రోడ్డు ప్రమాదంలో సిఆర్పిఎఫ్ జవాన్ మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని బీబీ గూడెం వద్ద చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో CRPF జవాన్ మృతి
X

దిశ, చివ్వెంల: రోడ్డు ప్రమాదంలో సిఆర్పిఎఫ్ జవాన్ మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని బీబీ గూడెం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఆత్మకూర్ (ఎస్) మండలం ఏనుభాముల గ్రామానికి చెందిన కలకొట్ల శ్రీను (45) సిఆర్పిఎఫ్ జవాన్ గా మణిపూర్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సెలవు పెట్టి తన సొంత గ్రామానికి మూడు రోజుల క్రితం వచ్చారు. శనివారం తన బంధువుల దశ దిశ కార్యక్రమం ఉండడంతో ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఇక మార్గం మధ్యలో బీబిగూడెం వద్ద డీసీఎం వాహనం ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

Next Story