నేరాలు తగ్గాయి..శిక్షలు పెరిగాయి : ఎస్పీ శ‌ర‌త్ చంద్ర‌ ప‌వార్

by Nallavelli.Anjaneyulu |

దిశ, నల్లగొండ క్రైం : నల్లగొండ జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2025 సంవత్సరానికి నేరాలు త

నేరాలు తగ్గాయి..శిక్షలు పెరిగాయి : ఎస్పీ శ‌ర‌త్ చంద్ర‌ ప‌వార్
X

దిశ, నల్లగొండ క్రైం : నల్లగొండ జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2025 సంవత్సరానికి నేరాలు తగ్గుముఖం పట్టగా.. నేరస్థులకు శిక్షలు పెరిగాయి. నల్లగొండ జిల్లా పోలీసు శాఖ – 2025 సంవత్సర వార్షిక నివేధికను నల్లగొండ డీపీవోలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెళ్లడించారు. నేర నియంత్రణ, ప్రజల భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, ఆస్తి నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి అనేక కీలక రంగాల్లో గణనీయమైన పురోగతిని జిల్లా పోలీసులు సాధించారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తు, సమర్థవంతమైన అభియోగాలే ఈ ఫలితాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

నేరాల నియంత్రణ – గణనీయమైన తగ్గుదల

2024తో పోలిస్తే.. 2025లో నల్గొండ జిల్లాలో మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కి తగ్గాయి. తీవ్రమైన నేరాలు 221 నుంచి 169కి తగ్గాయి. ప్రత్యేకంగా లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు ఏం జరగలేదు. హత్యలు, అత్యాచారాలు, చోరీలు, మోసాలు వంటి ప్రధాన నేరాలు తగ్గాయి.

శిక్షల అమల్లో 103శాతం వృద్ధి

నేరాల నియంత్రణతో పాటు న్యాయసేవల అందించడంలో జిల్లా పోలీసు శాఖ దృఢమైన కట్టుబాటుతో పనిచేసింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు ఘోర నేరాల కేసుల్లో రెండు మరణ శిక్షలు, జీవిత ఖైదు సహా మొత్తం 132దోషలుగా నిర్ధారించబడ్డారు. 2024తో పోలిస్తే శిక్షల శాతం 103శాతం పెరిగింది. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల సమర్థ వినియోగం, ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం వల్ల నాణ్యమైన శిక్షలు ఖరారయ్యాయి. సైబర్ నేరాలల్లో బాధితులు 2024లో రూ.16.31 కోట్లు, 2025లో రూ.4.62 కోట్లు పోగొట్టుకున్నారు. దీంతో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో జిల్లా సైబర్ క్రైం కోర్టినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. వీపీవో వ్యవస్థ ద్వారా గ్రామాలు, పట్టణాల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలతో,దీని వల్ల సైబర్ మోసాలపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. లోక్ అదాలత్ లోక్ అదాలత్ ద్వారా 49,943 కేసులు పరిష్కరించారు. నల్లగొండ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ 24 గంటల నిరంతర పర్యవేక్షణ చేపడుతోందని ఎస్పీ తెలిపారు. డ్రగ్ ఫెడ్లర్లు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుని 53మందిని అరెస్ట్ చేసి, 304.756 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై క్రమం తప్పకుండా హైవే పెట్రోలింగ్, ప్రమాదాలు తరచుగా జరిగే 109 గ్రామాల గుర్తించారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన 4,832 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. డయల్-100కు 2024లో 55,184 కాల్స్, 2025లో 53,203 కాల్స్ వచ్చాయి. సగటున 4నిమిషాలు 5సెకన్లుకు ఒక ఫోన్ బాధితుల నుంచి వెళ్లింది. సెప్టెంబర్ 2025లో రూ.8లక్షల వ్యయంతో, తెలంగాణలోనే తొలి పోలీస్ క్రెచ్ ను నల్లగొండలో ప్రారంభించారు.

నేరస్థులకు శిక్షలు కఠినంగా అమలు చేస్తాం

నల్లగొండ జిల్లాలో నేరానికి పాల్పడిన ఎంతవారైన కఠినంగా శిక్షలు అమలు చేస్తాం. బాధితులకు నల్లగొండ జిల్లా పోలీసులు ఎల్లప్పడూ అండగా ఉంటారు. డ్రగ్స్ కు బానిసైనా, విద్యార్థినులను, మహిళలను వేధించే ఆకాయితాలపై కొరడా ఝుటిపిస్తాం. సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. ఇకపై నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూనే, జరిమానాలు శిక్షలు విదిస్తాం.

Next Story