- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దాలి : ఎంపీడీవో భాస్కర్
దిశ, భూదాన్ పోచంపల్లి : డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో భాస్కర్ అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మండల

X
దిశ, భూదాన్ పోచంపల్లి : డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో భాస్కర్ అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మాదకద్రవ్యాల కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు మత్తు పదార్థాలను కొనుగోలు, అమ్మకం అక్రమ రవాణా వంటివి చేస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ సత్యనారాయణ, పీఆర్ఏ దామోదర్, సీనియర్ అసిస్టెంట్ అపర్ణ, ఏపీవో కృష్ణమూర్తి, సుమిత్ర, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Next Story






