రైతులకు యూరియా అందించడంలో మోడీ ప్రభుత్వం విఫలం

by velandi.Saikiran |

యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ(ఎం) నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి

రైతులకు యూరియా అందించడంలో మోడీ ప్రభుత్వం విఫలం
X

దిశ, మర్రిగూడ (నాంపల్లి): తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ(ఎం) నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి విమర్శించారు. నాంపల్లి ఏవో కార్యాలయం ముందు ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర రైతాంగానికి ఒరిగిందేమీ లేదని ఎద్దేవ చేశారు.


రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటివరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేంద్రం ఇచ్చిందని దీనితో రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వాల్సిన పార్టీ రాష్ట్రంలో రైతుల తరఫున పోరాడుతున్నట్టు పోజు పెట్టడం రైతాంగాన్ని మోసం చేయడమే అని అన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు చేయకుండా యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా పైన పోరాడకుండా కల్లప్పగించి చూస్తూ రైతులను ఇబ్బందులకు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కోమ్ము లక్ష్మయ్య, సిరగోని వీరయ్య, బొడ్డుపల్లి తిరుపతమ్మ, పెద్దిరెడ్డి వెంకట్ రెడ్డి,వీరయ్య, చింటూ, యాదయ్య, రాములు, వెంకటయ్య,సైదులు, వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.

Next Story