- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఎం నాయకులు లింగయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తి : మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి
దిశ, కనగల్ : నిరంతరం పేదల సమస్యలపై పోరాడుతూ కడవరకు కమ్యూనిస్టుగా బ్రతికిన కామ్రేడ్ జినుకుంట్ల లింగయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర సీనియర్ నాయకులు నంద్యాల నరసింహారెడ్డి అన్నారు.

దిశ, కనగల్ : నిరంతరం పేదల సమస్యలపై పోరాడుతూ కడవరకు కమ్యూనిస్టుగా బ్రతికిన కామ్రేడ్ జినుకుంట్ల లింగయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర సీనియర్ నాయకులు నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. గురువారం కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామంలో సీపీఎం జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ జినుకుంట్ల లింగయ్య స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడారు. చిన్ననాటి నుంచి ఎర్రజెండా చేతబట్టి గ్రామాలలో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నడిపిన వీరుడు అని కొనియాడారు. వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు పెరగాలని దున్నేవాడికే భూమి, గీసే వాడికి చెట్టు ఉండాలనే నినాదంతో కల్లుగీత కార్మికుల హక్కుల కోసం గ్రామాలలో సొసైటీలు ఏర్పాటు చేసి హరాజు వేలంపాటలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారని అన్నారు.
చిన్ననాటి నుంచి పోరాటాల వైపు
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండి పోరాటాల వైపు నడిచిన లింగయ్య కడవరకు ఎర్రజెండా వీడలేదని ఆయన మరణం కనగల్ మండల ప్రజానీకానికి, సీపీఎం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన పోరాడిన జెండాను ముందుకు తీసుకుపోవడమే ఆయనకు ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ హశం, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సత్తయ్య, కొండ వెంకన్న, ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాయల శేఖర్ మాజీ చైర్మన్ లు అలుగుబెల్లి నర్సిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ చీదేటి కృష్ణారెడ్డి , చింతలబహ్మయ్య, బ్రహ్మనందరెడ్డి కందుల సైదులు, ఎండీ అక్రమ్, కుటుంబ సభ్యులు జినుకుంట్ల సైదులు సునీత, కృష్ణయ్య కలమ్మ ,చెనగోని యాదగిరి , అంజమ్మ , పాలకురి పుల్లయ్య యాదమ్మ, మట్టపల్లి పాపయ్య, అండాలు, సురిగల రాములు అంశమ్మ పాల్గొన్నారు.






