ప్రజా ఉద్యమానికి ఊపిరిలూదిన మహోన్నత చరిత్ర సీపీఐది : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

by Ratna Kumari |

దిశ, అనంతగిరి : పేదల పక్షాన నిరంతరం పోరాడేది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని సీపీఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ 1925 డిసెంబర్ 26న, ఆవిర్భవించి నేటికీ భారత గడ్డపై

ప్రజా ఉద్యమానికి ఊపిరిలూదిన మహోన్నత చరిత్ర సీపీఐది : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
X

దిశ, అనంతగిరి : పేదల పక్షాన నిరంతరం పోరాడేది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని సీపీఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ 1925 డిసెంబర్ 26న, ఆవిర్భవించి నేటికీ భారత గడ్డపై 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా డిసెంబర్ 26 న, ఖమ్మంలో లక్షలాది మందితో జరిగే సీపీఐ ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని సత్యం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఐ వందేళ్ల చరిత్రను ప్రజానీకానికి చాటెందుకు, 100 ఏళ్ల ముగింపు సభ విజయవంతానికి ఈనెల 15 న, గద్వాల్ లో ప్రారంభ‌మైన బస్సు జాత శుక్రవారం అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు జాతాకు డప్పులు, బాణాసంచాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో భారీ బైక్ ర్యాలీతో స్థూపం వద్ద అమరులకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని మొట్టమొదటగా గర్జించిన పార్టీ సీపీఐ అన్నారు.

100 ఏళ్ల ఉత్సవాల సందర్బంగా పార్టీ ఆవిర్భవించిన కాన్పూర్ లో గత సంవత్సరం 26 న ప్రారంభమై దేశ వ్యాప్తంగా ఉత్సవాలు ఉత్సహంగా జరుగుతున్నాయని అన్నారు. బ్రిటిష్ వారి నుంచి దేశ విముక్తి కి రాజీలేని పోరాటాలు చేస్తున్నందునే ఆనాడు పార్టీపై నిషేధం విధించార‌ని తెలిపారు. ఎన్ని నిర్బంధాలు చేసిన జైలులో పెట్టిన అలుపెరగకుండా కార్మిక విద్యార్థి యువజన రైతు మహిళా ప్రజా సంఘాల నిర్మించి వెట్టి చాకిరి విముక్తి కొరకు కార్మికులు కర్షకులను దోపిడీ నుండి విముక్తి చేయడానికి రాజీలేని పోరాటాలు సిపిఐ నిర్వహించిందని ఆయన అన్నారు.పోరాటాల ద్వారా దేశంలో అనేక కార్మిక సంక్షేమ చట్టాలను సాధించింది కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కార్య వర్గ సభ్యుడు బాల నరసింహ, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్, నారాయణరెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎస్కే సాయి బల్లి, ఎస్కే లతీఫ్, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సృజన, మండల కార్యదర్శి రవి ,సహాయ కార్యదర్శి లాలు, యువజన సంఘం అధ్యక్షులు మండలం డేగ వీరయ్య ,రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, నాగభద్రం, శాఖ కార్యదర్శి వీరబాబు ,మండల కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story