- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ కార్మికుల సమ్మెకు సీపీఐ మద్దతు
గ్రామపంచాయతీ సిబ్బంది తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెకు సీపీఐ పార్టీ మద్దతు తెలిపింది.

దిశ, చౌటుప్పల్ టౌన్ : గ్రామపంచాయతీ సిబ్బంది తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెకు సీపీఐ పార్టీ మద్దతు తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని ఆదివారం సీపీఐ పార్టీ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి సందర్శించి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా పల్లెశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ సిబ్బందికి కనీస వేతనం నెలకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ కలిగిన పంచాయతీ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పురపాలిక కమిటీ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండూరి వెంకటేష్, భూతం నరసింహ, రాసాల యాదయ్య, కొయ్యలగూడెం బిక్షం, గుంటి ధనమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.






