సాగర్ ఎడమకాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలి.. CPI leader Pokala Venkateswarlu

by Javid Pasha |   (  Updated:2022-12-03 15:16:45  IST  )

సాగర్ ఎడమకాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని సీపీఐ నేత పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సాగర్ ఎడమకాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలి.. CPI leader Pokala Venkateswarlu
X

దిశ, గరిడేపల్లి: యాసంగి పంటకు సాగర్ ఎడమకాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గరిడేపల్లి మండలంలోని గానుగబండ గ్రామంలో జరిగిన సీపీఐ గ్రామ కమిటీ సమావేశానికి పోకల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోర్లు, బావులు, చెరువుల కింద భూముల ఉన్న రైతులు 10 రోజులుగా యాసంగి పొలం పనుల్లో బిజీగా ఉన్నారని, కానీ సాగర్ నీళ్ల మీద ఆధార పడ్డ రైతులు మాత్రం నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉండి కూడా రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి నీళ్లు విడుదల చేయాలని పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐకి చెందిన కడియాల అప్పయ్య, ఈదా సైదులు, జొన్నలగడ్డ తిరపయ్య, తాళ్ల తిరపయ్య, షైక్ నబీ సాహెబ్, షైక్ సైదులు, పీరసాహెబ్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story