- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని గర్జించిన ఏకైక పార్టీ సీపీఐ : బోలగాని సత్యనారాయణ
భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని గర్జించిన ఏకైక పార్టీ సీపీఐ అని జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యానారాయణ అన్నారు. రాజపేట మండల కేంద్రంలో సీపీఐ మండల సమితి సమావేశం ఎం.డీ. దస్తగిరి అధ్యక్షతన నిర్వహించారు.

దిశ, రాజాపేట : భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని గర్జించిన ఏకైక పార్టీ సీపీఐ అని జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యానారాయణ అన్నారు. రాజపేట మండల కేంద్రంలో సీపీఐ మండల సమితి సమావేశం ఎం.డీ. దస్తగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై వందేళ్లు పూర్తి చేసుకున్నదని గుర్తు చేశారు. బ్రిటిష్ వారి నుంచి మన దేశ విముక్తి కొరకు రాజులేని పోరాటాలు నిర్వహించిన పార్టీ సీపీఐ అని కార్మిక విద్యార్థి యువజన రైతు మహిళా తదితర ప్రజాసంఘాలను నిర్మించి వెట్టి చాకిరివిముక్తి కొరకు కార్మికులు కర్షకులను దోపిడి నుండి విముక్తి చేయడానికిరాజీ లేని పోరాటాలు నిర్వహించి న ఘనత సీపీఐదే అన్నారు. ఈ నేపథ్యంలో వందేళ్ల ముగింపు సభ ఖమ్మంలో జరుగుతున్న సందర్భంగా రాజపేట మండలం నుంచి వందలాది మందిని తరలించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుర లింగం, జిల్లా సమితి సభ్యులు గాదగాని మాణిక్యం, మండల సహాయ కార్యదర్శి ఇంజా హేమలత, ఎండి దస్తగిరి జంగా అంజయ్య, మంగ ఐలయ్య, ఎడ్ల ప్రభాకర్ , రాములు, గుంటి యాదగిరి, సిద్ధులు, దొరగొల్ల సత్తయ్య,రచ్చ నర్సింలు, శ్రీనివాస్, గొర్రెల పోశయ్య పాల్గొన్నారు.






