మెప్మాలో అంతా ఆమెదే ఇష్టారాజ్యం..

by Bhanu |   (  Updated:2025-05-06 15:21:26  IST  )

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటుచేసిన మెప్మా.... ఇప్పుడు అంత అవినీతిమయంగా మారింది...

మెప్మాలో అంతా ఆమెదే ఇష్టారాజ్యం..
X

దిశ, కోదాడ: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటుచేసిన మెప్మా.... ఇప్పుడు అంత అవినీతిమయంగా మారింది... మున్సిపాలిటీ పరిధిలో సమ భావన సంఘాల బలోపేతాలపై ప్రభుత్వం మెప్మాను ఏర్పాటు చేసి ప్రతి సంఘం కు ఒక ఆర్బినీ ఏర్పాటు చేసింది. వీరికి లోన్లు మంజూరు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. వీరిని పర్యవేక్షించేందుకు వీరిపై అధికారిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అధికారి అంతా చక్రం తానే చక్రం తిప్పుతుంది. తనకు అనుకూలంగా ఉండే ముడిపూలు చెల్లించిన వారికి మాత్రమే మెప్మాలో పనులు మళ్లీమళ్లీ వచ్చేలా చూస్తుంది. ఆమెది ఔట్సోర్సింగ్ జాబ్ అయినప్పటికీ పర్మినెంట్ ఎంప్లాయి లెక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది.


ఇటీవల కోదాడ మున్సిపాలిటీకి సి ఓ రావాల్సి ఉండగా అది జాయింట్ కలెక్టర్ లెటర్ తో రావాల్సి ఉంటుంది. అంతేగాని ఆమె రెగ్యులర్ ఎంప్లాయిస్ లెక్క సంతకం పెట్టి లెటర్ ఇచ్చి పంపించింది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కుట్టే బాధ్యత సంఘం గ్రూప్ సభ్యులకు ఉంటుంది. కానీ సదరు అధికారికి ఎవరైతే ముడుపులు ఇచ్చారు వారికే మళ్లీమళ్లీ పనులు అప్పగిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకునే పాపను పోలేదు. ఒకవేళ తెలిసి అడిగిన వాటిని భయభ్రాంతులకు గురిచేస్తూ కిందిస్థాయి సిబ్బందికి చెప్పి ఫోటోలు తీయమని భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story