- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండకు కార్పొరేషన్ హోదా
నల్లగొండ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సెక్రటరీ కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, నల్లగొండ కలెక్టరేట్ : నల్లగొండ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సెక్రటరీ కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాలన పరంగా నల్లగొండకు ఎక్కువ అధికారాలు, విస్తృత పరిధి పెరిగే అవకాశం ఉంది. అభివృద్ధి కోసం నిధులు పెరుగనుండటంతో పాటు రాష్ట్ర, కేంద్ర పథకాలు నేరుగా అందే అవకాశం ఉంది. కొత్త వార్డుల పునర్వ్యవస్థీకరణ అవకాశం, మేయర్, డిప్యూటీ మేయర్ వ్యవస్థ అమలులోకి రానుంది. కమిషనర్ స్థాయి అధికారుల ద్వారా పాలన మరింత బలోపేతం కానుంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం,పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్‌లో కార్పొరేషన్ నిబంధనలు అమలు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ విధానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ మున్సిపాలిటీ కి కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.






