నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతా: ఎమ్మెల్యే చిరుమర్తి

by Bhoopathi Nagaiah |

నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా మార్చుతానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతా: ఎమ్మెల్యే చిరుమర్తి
X

దిశ, నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా మార్చుతానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. రామన్నపేట మండలం సర్నేనిగూడెంలో 10 లక్షలతో, వెల్లంకి గ్రామంలో 20 లక్షలతో, సిరిపురం గ్రామంలో 9 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయించలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించిన విషయాన్నిఎమ్మెల్యే గుర్తు చేశారు. అభివృద్ధి కళ్ళముందే కనిపిస్తున్న ప్రతిపక్ష నాయకులు అనవసరంగా మాట్లాడుతున్నారని, అభివృద్ధి జరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, జడ్పిటిసి సభ్యులు పున్నలక్ష్మీ జగన్మోహన్, పిఎసీ ఎస్ చైర్మన్ బిక్షం రెడ్డి, మహేందర్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story