- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
64 మంది కానిస్టేబుళ్లు బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ
జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల లో పని చేస్తూ 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 64 మంది కానిస్టేబుల్ లకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేసిన జిల్లా ఎస్పి నరసింహ.

దిశ,సూర్యాపేట: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల లో పని చేస్తూ 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 64 మంది కానిస్టేబుల్ లకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేసిన జిల్లా ఎస్పి నరసింహ. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం లో నీ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పి మాట్లాడుతూ... పోలీస్ యూనిఫాం కు సమాజంలో ప్రత్యేకమైన స్థానం ఉoదనీ, ప్రజల దృష్టి మనపై ఉంటుందనీ, ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. తోటి సిబ్బందికి పనిలో సలహాలు ఇస్తూ ఆదర్శంగా ఉండాలని తెలిపా రు. స్టేషన్ పరిధిలో జరిగె అసాంఘిక కార్యకలాపాలు గుర్తించి నిరోధించడంలో కృషి చేయాలని సూచించారు. మంచి ఆహార అలవాట్లు కలిగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ, సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయడం, యోగ చేయడం లాంటి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, ఏ ఆర్ నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగబుషన్ రావు, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్, మహేష్, సిబ్బంది ఉన్నారు.






