నిమజ్జన యాత్రలో కానిస్టేబుల్ పై దాడి

by velandi.Saikiran |

కోదాడ పట్టణంలో నిమజ్జ‌న‌ యాత్రలో కానిస్టేబుల్ పై దాడి జ‌రిగింది. పట్టణంలోని అనంతగిరి రోడ్డులో శోభాయాత్ర కొనసాగుతున్న

నిమజ్జన యాత్రలో కానిస్టేబుల్ పై దాడి
X

దిశ, కోదాడ : కోదాడ పట్టణంలో నిమజ్జ‌న‌ యాత్రలో కానిస్టేబుల్ పై దాడి జ‌రిగింది. పట్టణంలోని అనంతగిరి రోడ్డులో శోభాయాత్ర కొనసాగుతున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే... వారిని నిలువరించేందుకు కానిస్టేబుల్ నరేష్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో నరేష్ పై రాడ్డుతో దాడి చేయడంతో తల పగిలింది. దీంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి అక్క‌డి నుంచి మెరుగైన చికిత్స కొరకు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి త‌ర‌లించారు. ఇక ఈ సంఘ‌ట‌న‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story