రోడ్డు ప్రమాదం బాధాకరం.. కొర్రి శీను కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఉత్తమ్

by Bhanu |

హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్టంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొర్రి శ్రీను దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదం బాధాకరం.. కొర్రి శీను కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఉత్తమ్
X

దిశ, నకిరేకల్ టౌన్ : హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్టంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొర్రి శ్రీను దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కట్టంగూర్ మండలంలోని పామనగుండ్ల వద్ద చోటుచేసుకుంది.

శనివారం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీను పార్థివదేహానికి రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీను కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్, ప్రజా గాయిని వేముల పుష్పక్క తదితరులు పాల్గొన్నారు. మరణించిన శ్రీను కుటుంబానికి పార్టీతో పాటు ప్రభుత్వం నుండి అండగా నిలుస్తామని నేతలు తెలిపారు.



Next Story