- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీల్లో గెలుస్తుంది
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి క్లీన్ స్విఫ్ చేస్తుందని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, హుజూర్ నగర్ : రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి క్లీన్ స్విఫ్ చేస్తుందని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో 17 వార్డ్ సీపీఐ కౌన్సిలర్ అభ్యర్థి గుండు తిరుపతమ్మ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు అభివృద్ధి కోసం కాంగ్రెస్ మిత్ర పక్షాల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అర్బనైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీలలో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి ప్రజలకు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చి, అభివృద్ధి సంక్షేమాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. వార్డులలో ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వామపక్ష పార్టీల కౌన్సిలర్లకు అభివృద్ధి పథకాలలో తగిన భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, కొప్పోజు సూర్యనారాయణ కాంగ్రెస్ నాయకులు యరగాని నాగన్న గౌడ్, బెల్లంకొండ వెంకటనారాయణ, దొంగరి వెంకటేశ్వర్లు, ఈడుపుగంటి సుబ్బారావు, దాస నాగేశ్వరరావు, బచ్చు రామారావు పాల్గొన్నారు.






