సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల నినాదాలు..

by Elthuri vijay kumar |

సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు.

సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల నినాదాలు..
X

సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల నినాదాలు..

- క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ చిత్రపటాల ఏర్పాటు

- ప్రభుత్వ అస్తిపై ప్రతిఒక్కరికి హక్కు ఉంది

- సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

దిశ, సూర్యాపేట: సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలను కార్యాలయ గోడలకు అతికించారు. ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తిపై ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రజల డబ్బుతో నిర్మించిన క్యాంపు కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌గా మారిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలలో ముఖ్యమంత్రి, స్థానిక జిల్లా మంత్రుల చిత్రపటాలు ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చిత్రపటం పెట్టకపోవడం పట్ల ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మేము పెట్టిన సీఎం, ఉత్తమ్ చిత్రాలను తొలగిస్తే జగదీష్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే, సూర్యాపేటలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లు కూల్చివేసి ఊరిని స్మశానం చేసిన చరిత్ర జగదీష్ రెడ్డిదేనని విమర్శించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వాడితే ఊరుకోమని, అవసరమైతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story