నిజాముద్దీన్ మృతి పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి

by Bhanu |

సూర్యాపేట జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు నిజాముద్దీన్ అకాల మరణం పట్ల రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నిజాముద్దీన్ మృతి పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి
X

దిశ, హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు నిజాముద్దీన్ అకాల మరణం పట్ల రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాముద్దీన్ నా చిరకాల మిత్రుడని హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక మూల స్తంభం లాంటి వారిని అభివర్ణించారు. అతని జీవితకాలం కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి, కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి తన జీవితం కృషి చేశారని పేర్కొన్నారు. అతని మరణం హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు తెలిపారు. అతని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు ఆయన స్వగృహం లింగగిరి వెళ్లి ఆయన పార్థివదేవానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించినట్లు తెలిపారు.

నిజాముద్దీన్ పార్థివదేహాన్ని నివాళులర్పించిన ఎమ్మెల్యే పద్మావతి.

గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ నిజాముద్దీన్ మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే కోదాడ ఎమ్మెల్యే ఎన్ ఉత్తమ్ పద్మావతి వెంటనే హుజూర్ నగర్ మండలంలోని ఆయన స్వగ్రామమైన లింగగిరి చేరుకొని ఆయన పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. నిజాముద్దీన్ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ఆమె గుర్తు చేశారు.


పలువురు సంతాపం..

నిజాముద్దీన్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఆయనకు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతిచెందిన విషయం తెలుసుకున్న వెంటనే అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనతో వారికున్న అనుబంధాలను పలువురుతో పంచుకున్నారు.

Next Story