ఎకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే

by Naresh N |
ఎకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే
X

దిశ, భూదాన్ పోచంపల్లి: ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పాలిట కల్పతరువుగా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఇంటింటికి కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన జలాల్పురం, పోచంపల్లి, రేవనపల్లి, శివారెడ్డి గూడెం, ఇంద్రియాల, వంకమామిడి, గ్రామాలలో ఆయన విస్తృతంగా గెలుపే ధ్యేయంగా ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సెంటిమెంటు పేరు చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రాబందుల్లా పిక్కు తింటున్నారని తీవ్రంగా విమర్శిస్తూ 10 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాల పేరుతో కొందరికి లబ్ధి చేకూర్చే విధంగా స్వార్థ రాజకీయాలను చేసి తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని అందుకే ఈసారి ఎలాగైనా కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం పలకాలని చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్ లీకులతో నిరుద్యోగులను అయోమయానికి గురిచేసి వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్నారనని, ఇచ్చిన హామీలన్నీ మోసాలేనని ధరణి పేరు చెప్పి అసైన్డ్ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తూ భూహక్కుదారులను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. దళిత బంధు, ఆరోగ్యశ్రీ తో సహా సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఎద్దేవ చేశారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ముక్త కంఠంతో కేసీఆర్ కుటుంబం పాలనకు చరమగీతం పాడాలని కోరుతున్నారనీ ప్రభుత్వ వ్యతిరేకతతో కాంగ్రెస్ పట్ల విశ్వాసంతో ప్రజలు ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టాలనే దీక్షతో ఎక్కడికెళ్లిన బ్రహ్మరథం పడుతున్నారనీ తప్పకుండా చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఈసారి భువనగిరి జిల్లా పై జెండా ఎగరవేసి చరిత్రను తిరగరాయాలని ప్రజలందరూ సహకరించి కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

కేసీఆర్ కుటుంబపాలనకు సమాధి కట్టండి: డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కళ్లెం రాఘవరెడ్డి

ప్రాజెక్టుల, సంక్షేమం అభివృద్ధి పేరుతో తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలను దోచుకున్న బీఆర్ఎస్ కేసీఆర్ పాలనకు సమాధి కట్టే తరుణం వచ్చిందని ప్రజలంతా విజ్ఞతతో ఓటు వేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించాలని నూతనంగా నియమించిన జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కళ్లెం రాఘవరెడ్డి ఓటర్లను కోరారు. తన పట్ల నమ్మకం ఉంచి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పదవికి సహకరించిన టీపీసీసీ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, డీసీసీ అధ్యక్షుడు అందెం సంజీవ రెడ్డి పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ సామ మధు సూదన్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మర్రి నర్సింహారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ భారత లవ కుమార్, ప్రధాన కార్యదర్శి బండారు ప్రకాష్ రెడ్డి , ఓబీసీ టౌన్ అధ్యక్షులు బిట్ల గణేష్ రావుల జంగయ్య కీర్తి సంజు, సయ్యద్ ఎజ్జాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed