- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరెగూడెంలో గెలుపొందిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి శ్యాంసుందర్
చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి నాగంపల్లి శ్యాంసుందర్ సర్పంచ్‌గా గెలుపొందాడు. చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన నాగంపల్లి శ్యాంసుందర్ మొదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సన్నిహితుడుగా ఉంటూ కాంగ్రెస్ నాయకునిగా పని చేస్తున్నాడు.

దిశ, చిట్యాల: చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి నాగంపల్లి శ్యాంసుందర్ సర్పంచ్‌గా గెలుపొందాడు. చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన నాగంపల్లి శ్యాంసుందర్ మొదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సన్నిహితుడుగా ఉంటూ కాంగ్రెస్ నాయకునిగా పని చేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో ఆరెగూడెం బీసీ జనరల్ రిజర్వ్డ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కావాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంను కోరడంతో ఆయన మరో అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. దాంతో నిరుత్సాహానికి గురైన శ్యాంసుందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్‌కు రెబల్ అభ్యర్థిగా నాగంపల్లి శ్యాంసుందర్ గ్రామంలోని మొత్తం ఎనిమిది వార్డులకు అభ్యర్థులను ఎంపిక చేసుకొని, సొంత ప్యానెల్ను ఏర్పాటు చేసుకొని బరిలోకి దిగాడు. ఇతనికి బీఆర్ఎస్, సీపీఎం పార్టీలు మద్దతు తెలపడంతో సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై 136 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న మొత్తం ఎనిమిది వార్డులలో ఒక వార్డు మినహా ఏడువార్డులలో తన ప్యానల్ అభ్యర్థులను గెలిపించుకోగలిగాడు. దీంతో గ్రామంలో ప్రజలు భారీగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం గ్రామంలో ప్రచారం చేసినప్పటికీ విజయం మాత్రం రెబల్ అభ్యర్థి నాగంపల్లి శ్యాంసుందర్‌ని వరించింది.






