- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే సామేల్‌పై అసత్య ఆరోపణలు మానుకోవాలి.. తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తూ తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కృషి చేస్తున్నారని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు

దిశ, శాలిగౌరారం: తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తూ తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కృషి చేస్తున్నారని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే మందులు సామేల్‌కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం, పార్టీలకతీతంగా సీఎం సహాయనిధి, కల్యాణ లక్ష్మి అనేక సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో పేద ప్రజలకు చేరవేయడంలో నిరంతరం ఎమ్మెల్యే మందుల సామేల్ కృషి చేస్తున్నారన్నారు. కొంతమంది వ్యక్తులు పనికట్టుకుని తుంగతుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచి పోరాడి తెలంగాణ సాధించివారిలో ఎమ్మెల్యే సామెల్ ప్రదములని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తుండడాన్ని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజల దీవెనలు ఎమ్మెల్యే మందుల సామేల్‌కు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు. అసత్య ప్రచారాన్ని, ఆరోపణలను మానుకోవాలని మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.






