- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంటల మార్పిడితో ఉత్తమ ఫలితాలు : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
by Kodari Anjali |
రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.

X
దిశ, మిర్యాలగూడ టౌన్: వ్యవసాయంలో పంటల మార్పిడి ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న జీలుగులు, జనుములను బుధవారం రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భూమి సారాన్ని పెంపొందించేందుకు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జీలుగులు, జనుములు వంటి పచ్చిరొట్ట పంటల సాగు ఎంతో ఉపయోగకరమని అన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారులు రుషేంద్రమణి, నాయకులు పొదిల శ్రీను, బసవయ్య, రవిందర్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






