దేవ‌ర‌కొండ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని కలెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ

by Nallavelli.Anjaneyulu |

దేవ‌ర‌కొండ ఏరియా ఆసుప‌త్రిని నల్ల‌గొండ క‌లెక్ట‌ర్ బి. చంద్ర‌శేఖ‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆసుప‌త్రిలోని ప‌లు వార్డుల‌ను సంద‌ర్శించి రోగుల‌కు అందుతున్న వైద్య సేవ‌ల‌పై ఆరా తీశారు.

దేవ‌ర‌కొండ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని కలెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ
X

దిశ‌, దేవ‌ర‌కొండ టౌన్ : దేవ‌ర‌కొండ ఏరియా ఆసుప‌త్రిని నల్ల‌గొండ క‌లెక్ట‌ర్ బి. చంద్ర‌శేఖ‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆసుప‌త్రిలోని ప‌లు వార్డుల‌ను సంద‌ర్శించి రోగుల‌కు అందుతున్న వైద్య సేవ‌ల‌పై ఆరా తీశారు. క‌లెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ నేరుగా రోగుల వ‌ద్ద‌కు వెళ్లి వారితో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణీ, అందుబాటులో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన, మెరుగైన చికిత్స అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదు అని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని.. వైద్య రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ అందుబాటులో ఉంచాలని తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణారెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story